హీరో నితిన్ గతకొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘తమ్ముడు’ కూడా ఆయనకు నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు తనకు ‘ఇష్క్’ వంటి కమ్‌బ్యాక్ మూవీని అందించిన దర్శకుడు విక్రమ్‌కుమార్‌తో నితిన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారని సమాచారం. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘స్వారీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇందులో నితిన్ హార్స్ రైడర్‌గా కనిపిస్తారని, యాక్షన్, ఎమోషనల్ అంశాల కలబోతగా విక్రమ్ కుమార్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని అంటున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. నాగచైతన్యతో ‘థాంక్యూ’ (2022) తర్వాత దర్శకుడు విక్రమ్ కుమార్ మరలా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.