నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తాజాగా భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో నితిన్ స్పందిస్తూ..‘స్టంట్ మాస్టర్ అనల్ అరసు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్‌తో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన పాటను కూడా చిత్రీకరించాం. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల వివరాలు తెలియజేస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు.