నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ప్రస్టేజియస్ మాస్ ఎంటైర్టెనర్ ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రధారులు. జూలై 4న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఆదివారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘భూ అంటే భూతం..’ అంటూ సాగే ఈ పాటను ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్టు ఆదివారం ఓ ప్రకటన ద్వారా వారు తెలిపారు.
తన మేనకోడల్ని ఆడిస్తూ హీరో పాడే ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆకట్టుకునేలా పాడారని మేకర్స్ తెలిపారు. స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్దిత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.