Srinu Vaitla – Nithiin | వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, దర్శకుడు శ్రీన్ వైట్ల కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరికి సరైన హిట్లు పడలేదన్న విషయం తెలిసిందే. 2016 నుంచి 2025 మధ్య నితిన్ నటించిన సినిమాలలో భీష్మ మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన తమ్ముడు చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో నితిన్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సమయంలోనే కెరీర్ పరంగా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన టైంలో కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేని దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలుస్తోంది.
శ్రీను వైట్ల విషయానికొస్తే బాద్షా తర్వాత ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇటీవల ఆయన రూపొందించిన విశ్వం చిత్రం కూడా పర్వాలేదనిపించినా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాంబినేషన్ నిజంగానే కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.