Nithin | హీరో నితిన్ శనివారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమాలు ‘రాబిన్‌హుడ్’ ‘తమ్ముడు’ నుంచి స్పెషల్ బర్త్‌డే పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
వినోదాత్మక యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. తాజా పోస్టర్లో ఆయన ట్రెండీ లుక్‌లో ైస్టెలిష్‌గా ఉన్నారు. సీక్రెట్ ఏజెంట్లా ఆయన లుక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తున్నారు.
ఇక ‘తమ్ముడు’ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు శనివారం ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నితిన్ ఓ బస్సుపై కూర్చొని తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో శూలం ఉంది. నితిన్ గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్నందిస్తున్నారు.