Robinhood | నితిన్, శ్రీలీల జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవలే టీజర్‌ని కూడా విడుదల చేశారు.
ఈ నెల 26న ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో డైనమిక్ డ్యాన్స్ మూమెంట్‌తో నితిన్, శ్రీలీల ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. అందరికీ నచ్చే కమర్షియల్ ఎంటైర్టెనర్‌గా దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.