Production No. 43 | యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపొందుతున్న తాజా చిత్రం (Production No. 43) నేడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరై సందడి చేశారు.
ఈ సినిమా ద్వారా సోము నర్రి దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతుండగా, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ నితిన్ సరసన కథానాయికగా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఇతర పనులు పూర్తి చేసుకుని, మే రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న సితార సంస్థ ఈ సినిమాతో నితిన్‌కు ఒక భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ చిత్ర టైటిల్ మరియు పూర్తి నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
#SitharaEntertainments Production No. 43 begins on a beautiful note with an auspicious Pooja Ceremony ✨
Shoot starts from the 2nd week of May 🔥@actor_nithiin @RitikaNayak_ @NariSirisawada @somuthota @vamsi84 #SaiSoujanya @sureshbobbili9 #AnithMadadi @jonnyshaik @SVR4446… pic.twitter.com/j8o0YjQX4G
— Sithara Entertainments (@SitharaEnts) May 6, 2026