అలా వెళ్లిపోకే బంగారం..
నితిన్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర హీరో నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ‘రుక్కు రుక్కు రుక్మిణి’ అనే తొలి పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పాటను పూర్ణాచారి రచించారు.

అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇందులో మధ్యతరగతి యువకుడైన కృష్ణగా నితిన్, స్కూల్ టీచర్ రుక్మిణి పాత్రలో కథానాయిక ఆఫియా సయ్యద్ కనిపించారు. పాటలోని విజువల్స్, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలిచింది. ‘తకధిమి తానా అని ఆడుకోకే బంగారం, తికమక చేసి అలా వెళ్లిపోకే బంగారం, బహుమతిలాగా నిన్ను చూసుకుంటా బంగారం, రుక్కు రుక్కు రుక్మిణి ..ఒప్పేసుకో నా రాణి’ అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు