Nithiin31 | ఇమేజ్ మార్చుకోవడానికి నితిన్ తంటాలు

Nithiin31 | ఎలాంటి హీరోకైనా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఉంటుంది. ఒక్కసారి ఆ ఇమేజ్ వచ్చిందంటే.. ముందు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి. తన కమర్షియల్ రేంజ్ పెంచుకుంటాడు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా హీరోలకు మాస్ ఇమేజ్ అనేది ఒక కల. అది కొందరికి చాలా త్వరగా వస్తుంది. మరి కొందరికి ఎంత ప్రయత్నించినా కూడా రాదు. మరికొందరు మాత్రం క్లాస్, మాస్ మధ్యలో ఊగిసలాడుతుంటారు. ఈ మూడో రకం హీరో నితిన్. కొన్నిసార్లు మాస్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడు.. మరి కొన్నిసార్లు సూపర్ క్లాస్ సినిమాలకు వస్తాడు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన కోరుకున్న మాస్ హీరో ఇమేజ్ పూర్తిస్థాయిలో రాలేదు.
దానికి తోడు ఈ మధ్య కాలంలో నితిన్ కు వచ్చిన భీష్మ, అ..ఆ.. లాంటి విజయాలు క్లాస్ కథతో తెరకెక్కాయి. దీంతో పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ చేయడానికి చాలా రోజులుగా సరైన కథ కోసం చూస్తున్నాడు నితిన్. ఈ ఏడాది ఆయన నటించిన చెక్, రంగ్ దే కూడా క్లాస్ సినిమాలే. ఇప్పుడు విడుదలకు సిద్ధమైన మాస్ట్రో కూడా విభిన్నమైన సబ్జెక్ట్. ఇలాంటి సమయంలో ఒక ఊరమాస్ సినిమాతో వస్తున్నాడు నితిన్. ఏ సందడి లేకుండా తన సొంత ప్రొడక్షన్ హౌజ్ లో 31న సినిమాను మొదలు పెట్టాడు. కొత్త దర్శకుడు ఎంఎం రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాచర్ల నియోజకవర్గం ( macherla niyojakavargam )అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైంది.
ఈ సినిమాలో నితిన్ మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. బహుశా ఇప్పటి వరకు తన కెరీర్లో ఎప్పుడూ చేయనంత మాస్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నట్లు మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. తాను కోరుకున్న మాస్ ఇమేజ్ మాచర్ల నియోజకవర్గం సినిమా తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నాడు నితిన్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Republic | శివగామిని మించిపోయే క్యారెక్టర్ చేస్తున్న రమ్యకృష్ణ
బిగ్ బాస్ 5 తెలుగులో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు.. డేంజర్ జోన్లో ఇద్దరు..!
Roja: రోజా కూతురి బర్త్ డే .. వైరల్గా మారిన ఫొటోలు
Chiranjeevi: మెగాస్టార్ ఇంటి వినాయకుడిని చూశారా..!
Love Story: లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

