బిగ్ బాస్ 5 తెలుగులో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు.. డేంజర్ జోన్లో ఇద్దరు..!

bigg boss 5 | బిగ్ బాస్ షో మొదలై అప్పుడే వారం రోజులు కావస్తోంది. తొలి వారం ఆరుగురు సభ్యులు ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేషన్స్‌లో ఉన్నారు. వచ్చిన తొలి వారంలోనే కొందరు కంటెస్టెంట్స్ గొడవలు పడుతూనే ఉన్నారు. పాలు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిందే గొడవ పడడానికి అన్నట్లుగా వాళ్ల క్యారెక్టర్ ఉంది. తొలి వారం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో యాంకర్ రవి, హమీద, మోడల్ జశ్వంత్, యూ ట్యూబర్ సరయు, టీవీ యాక్టర్ మానస్, ఆర్కే కాజల్ ఉన్నారు. వీళ్లలో తొలి వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఆసక్తికరమే.
యాంకర్ రవి అయితే కచ్చితంగా ఎలిమినేట్ అవ్వడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయనకు బయట ఉన్న గుర్తింపు కచ్చితంగా ఓట్లు పడేలా చేస్తుంది. ఆయనతో పాటు ఆర్జే కాజల్‌కు కూడా బయట మంచి గుర్తింపు ఉంది. ఇక సీరియల్ నటుడు మానస్ ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వడం కష్టమే. మోడల్ జశ్వంత్ వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే కాస్త అమాయకంగా కనిపిస్తూ సింపతి తెచ్చుకుంటున్నాడు. పైగా మూడో రోజు నుంచి మనోడు తనలోని ఇంకో కోణం బయటపెట్టాడు. ప్రస్తుతానికి మోడల్ జస్వంత్ ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉంది. మొదటి వారం ఎలిమినేషన్ నుంచి ఈయన తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరోయిన్ హమీదా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంది. అందరి కంటే డేంజర్ జోన్ లో ఉన్నది ఈమె. నిజం చెప్పాలంటే మొదటి రెండు మూడు రోజులు ఈ వారం హామీదా ఎలిమినేట్ అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ నాలుగు రోజులు గడిచిన తర్వాత లెక్కల్లో మార్పులు వచ్చాయి. ఈ వారం హమీదా కాకుండా.. సరయు డేంజర్ జోన్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
రెండు మూడు రోజుల తర్వాత గొడవలతో హమీదా బాగానే ఫేమస్ అయింది. కానీ వారం రోజుల తర్వాత కూడా సరయు ఇప్పటి వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంలో విఫలమైంది. ఇదే ఈమెకు ఇప్పుడు అతి పెద్ద మైనస్. ప్రస్తుతానికి సరయు, హమీదా ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. కచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మిగిలిన నలుగురు ఓటింగ్ శాతంలో బాగానే ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg boss: పండగ రోజు చల్లారని మంట..!
Roja: రోజా కూతురి బర్త్ డే .. వైరల్‌గా మారిన ఫొటోలు
Chiranjeevi: మెగాస్టార్ ఇంటి వినాయకుడిని చూశారా..!
Love Story: లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

