Robinhood | టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకడు వెంకీ కుడుముల (Venky Kudumula). ఈ యువ దర్శకుడు నితిన్ (Nithiin)తో తెరకెక్కించిన భీష్మ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో కొత్త సినిమా వస్తుందని తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తూ.. గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రానికి రాబిన్‌హుడ్ (Robinhood) టైటిల్‌ను ఫైనల్ చేశారు.
డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబ నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు… అంటూ సాగుతున్న గ్లింప్స్ వీడియో నితిన్ ఈ సారి సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది.
నితిన్ ఈ సారి దొంగగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చారు. నటకిరిటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ కాగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
బ్లూ థీమ్‌తో డిజైన్ చేసిన పోస్టర్లో నితిన్ మోడ్రన్ రాబిన్‌హుడ్‌గా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. సాంటాక్లాజ్ గెటప్‌లో కనిపిస్తూ తనదైన డైలాగ్ డెలివరీతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు రాబిన్‌హుడ్ ఖచ్చితంగా స్పెషల్ సినిమాగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని గ్లింప్స్‌తో అర్థమవుతోంది.
రాబిన్‌హుడ్ టైటిల్ గ్లింప్స్..
Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥
Say hello to your new family member – #ROBINHOOD ❤️🔥
Title reveal glimpse out now!
– https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD— Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024