Nithiin Tammudu | టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తమ్ముడు (Tammudu). వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం జూలై 04న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన చిత్రయూనిట్ తాజాగా మేకింగ్ వీడియోను వదిలింది. యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సినిమాలో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.