సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకాలపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను హీరో నితిన్ విడుదల చేశారు. ట్రావెల్ బ్లాగర్‌గా వివిధ ప్రాంతాల్లో పర్యటించే కథానాయకుడు అందమైన అమ్మాయి ప్రేమకు ఆకర్షితుడు అవడం టీజర్లో ఆకట్టుకుంది. లవ్, ఫన్ వంటి అంశాలతో సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తున్నది. నవంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.