అమరావతి : టాలీవుడ్ నటుడు నితిన్ (Actor Nithiin) శనివారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన (VIP darshan) సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. తన కొడుకుతో మొదటిసారి ఆలయానికి వచ్చిన నితిన్ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్ధప్రసాదాలు అందచేశారు. ఆలయం వెలుపల హీరో నితిన్‌ను చూడటానికి, వారితో ఫోటోలు దిగడానికి భక్తులు ఉత్సాహం చూపారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచియుండగా, టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 57,655 మంది భక్తులు దర్శించుకోగా 20,051 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 2.73 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.