Extra Ordinary Man | బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin). ఈ యంగ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.. శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే బ్రష్ వేసుకో అంటూ సాగే సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా నితిన్ షర్ట్‌లో నుంచి బ్రష్ తీస్తున్న మరో లుక్‌ను విడుదల చేస్తూ.. రేపు (నవంబర్ 10న) సెకండ్ సింగిల్ మీ ముందుకొస్తున్నట్టు తెలియజేశారు. నితిన్ సూపర్ స్టైలిష్‌గా కొంచెం మాస్ టచ్ ఇస్తూ కనిపిస్తున్న తాజా లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన డేంజర్ పిల్లా పాటకు మంచి స్పందన వస్తోంది.
రీసెంట్గా విడుదల చేసిన టీజర్లో నితిన్ క్లాస్, స్టైలిష్, మాస్ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు. అరే నువ్వొక జూనియర్ ఆర్టిస్ట్‌వి.. అంటే ఎక్స్ట్రాగాడివి.. ఒక ఆర్డినరీగాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు.. అంటూ టీజర్లో కొడుకు క్యారెక్టరైజేషన్ గురించి రావు రమేశ్ సంభాషణలు ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండగా.. యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఇటీవలే లాంఛ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నితిన్ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్లో VNRTrio (వర్కింగ్ టైటిల్)లో కూడా నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్, రష్మిక మందన్నా, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
బ్రష్ వేసుకో సాంగ్ నయా లుక్..
The energetic #BrushVesko from #ExtraOrdinaryMan is dropping tomorrow 🥁#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @Jharrisjayaraj @vamsivakkantham#SudhakarReddy #NikhithaReddy @SreshthMovies #RajKumarAkella @vamsikaka @adityamusic @WallsAndTrends pic.twitter.com/ubDFsiECmW
— Suresh PRO (@SureshPRO_) November 9, 2023
Brace yourself for the #ExtraOrdinaryMan‘s Second Single #BRUSHVESKO on November 10th ❤️🔥#ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/2TGxLbsMB6
— nithiin (@actor_nithiin) November 8, 2023
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్..
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..