Nikki Galrani | యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వీరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆది-నిక్కీ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని, నిక్కీ గల్రానీ ప్రెగ్నెంట్ అంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. టాలీవుడ్లోనే కాదూ కోలీవుడ్లో సైతం ఈ వార్త హల్చల్ చేసింది. అయితే, రూమర్లపై తాజాగా నిక్కీ గల్రానీ తనదైన శైలిలో స్పందించింది. అవన్నీ వదంతులే అని కొట్టిపారేసింది.
‘నేను ప్రెగ్నెంట్ అయినట్లు కొందరు వార్తలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. ప్లీజ్ నా డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండి. కానీ, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు. ఈ వార్తను భవిష్యత్తులో తప్పకుండా బ్రేక్ చేస్తా. దయజేసి రూమర్లను వ్యాప్తి చేయకండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో పోస్టు చేసింది. నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి దాదాపు రెండేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దల అంగీకారంతో ఈ ఏడాది మేలో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.