సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోవడంతో వెంటనే దగ్గరలోని మెడికోర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో సాయిధరమ్ తేజ్‌కు కొద్దిసేపు ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడ నుండి అపోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో సాయి తేజ్ కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి.రోడ్డుపై మట్టి, బురద ఉండడం వల్లే స్పోర్ట్స్ బైక్ స్కిడ్ ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చారు. అయితే సాయి ధరమ్ తేజ్‌కి ప్రమాదం జరిగిందని తెలిసి సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. ఆయనని పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూలు కట్టారు.
అయితే ఐసీయూలో ఉన్న సమయంలో సాయి తేజ్‌ని స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్స్ ప్రయత్నిస్తూ.. ‘కళ్లు తెరవండి.. ఇటు చూడండి అంటూ భుజం తడుతుండగా, ఆ వీడియో బయటకు వచ్చింది. దీనిపై నిఖిల్ సీరియస్ అయ్యాడు.ఐసీయూలో ఉన్నప్పుడైన వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. ఐసీయూలోకి కెమెరాస్ ఎందుకు అనుమతి ఇస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఐసీయూ వీడియో బయటకు రావడం దారుణం అంటూ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు నిఖిల్.
Why are Cameras being allowed into an ICU ? It’s sad to see these videos of @IamSaiDharamTej getting treated. Please Respect A persons Privacy🙏🏽 At least inside a Hospital ICU…
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 13, 2021