Nikhil Siddhartha | ఇప్పుడున్న కుర్ర హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా, అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో సినిమాలు చేస్తుంది ఒక్క నిఖిల్ మాత్రమే. ఆయన లైనప్ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవల్లో సాలిడ్ మార్కెట్ పెంచుకున్న నిఖిల్.. అలాంటివే మరో రెండు హిట్లు పడితే టైర్1 హీరోల సాటి నిలివడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్న మాటలు. మొన్నటికి మొన్న డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న స్పై సైతం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఫైనల్ రన్‌లోనూ ఈ సినిమా పెద్దగా నష్టాలు తెచ్చిపెట్టలేదు. ఇక ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నవే. అందులో స్వయంభు ఒకటి. తమిళంలో పలు సినిమాలు రైటర్‌గా పని చేసిన భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. యుద్ద వీరుడి గెటప్‌లో ఉన్న నిఖిల్‌ను చూసి ఫిదా అవని సినీ ప్రేక్షకుడు లేడు. ఇక ఈ సినిమా కోసం నిఖిల్ కత్తి సాము నేర్చుకుంటున్నాడు. వియత్నాం సముద్ర తీరంలో నిఖిల్ కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రొఫెషనల్‌లా కత్తి తిప్పుతున్న నిఖిల్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. టాలీవుడ్ లక్కి గర్ల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను భువన్ , శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాకు రవిబస్రూర్, రామకృష్ణ పరమహంస వంటి స్టార్ టెక్నిషన్లు పనిచేస్తున్నారు.