‘కార్తికేయ 2’తో పానిండియా విజయాన్ని అందుకున్నారు హీరో నిఖిల్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి ఈ పాన్ ఇండియా చిత్రానికి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ‘రెండేళ్ల ప్రయాణం.. 170రోజుల షూటింగ్‌తో ఓ మహాయజ్ఞంలా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాం. మహోన్నతమైన మన దేశ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13న పానిండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.’ అని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ చిత్ర షూటింగ్ విశేషాలను తెలియజేస్తూ.. ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ పేరుతో ఓ వీడియోను షేర్ చేశారు అఖిల్. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: విజయ్ కామిశెట్టి, కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.