Nikhil Siddharth | ‘హ్యపీడేస్’ చిత్రంతో వెండితెరకు పరిచయమై అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ్. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్ళు దాటింది. 2019లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. అయితే నిఖిల్ ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తిచేసేందుకు ఒకే సారి మూడు సినిమాలను పట్టాలెక్కించాడు.
సుకుమార్ సమర్పణలో ‘కుమారి21F’ ఫేం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన చిత్రం ’18పేజీస్’. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దీంతో పాటుగా ‘కార్తికేయ-2’ కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. 2014లో ఎనిమల్ హిప్నటిజం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ-2 తెరకెక్కింది. చందూముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి.
వీటీతో పాటుగా నిఖిల్ ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రంలో నిఖిల్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇక పోతే ఈ మూడు చిత్రాలు ఇదే ఏడాదిలో విడుదల కానున్నట్లు నిఖిల్ ట్విట్టర్లో హింట్ ఇచ్చాడు. 18పేజీస్, కార్తికేయ-2, స్పై పోస్టర్లను పక్కపక్కన జోడించి ఆ పోస్టర్‌పై 2022 అని రాసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. మూడేళ్ళుగా తన నుంచి సినిమా రాకపోవడంతో నిఖిల్ ఈ మూడు చిత్రాలు త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నాడట. ఈ మూడింటిలో కార్తికేయ-2 మాత్రమే విడుదల తేదీను ప్రకటించింది.
#18pages #Karthikeya2 #Spy pic.twitter.com/9LcdiD7PVP
— Nikhil Siddhartha (@actor_Nikhil) April 19, 2022