Karthikeya-2 Movie Trailer | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘కార్తికేయ-2’ ఒకటి. మాములుగానే ఒక హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది బ్లాక్ బాస్టర్ హిట్టయి, పైగా థ్రిల్లర్ జానర్ అయితే ఇక ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి. ప్రస్తుతం అలాంటి అంచనాలతోనే విడుదలకు సిద్ధమైంది కార్తికేయ-2. 2017లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 13న విడుదల కానుంది. చందూ ముండేటీ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం. ప్రమాదం లిఖితం. పరిష్కారం లిఖితం’ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. ఓ మొక్కు నిమిత్తం హీరో కుటుంబం ద్వారకా వెళ్ళడం.. అక్కడ జరిగే వింత పరిస్థితులు కార్తికేయలో క్యూరియాసిటీ పెంచడం. అస్సలు ఆ పరిస్థితులకు కారణం ఏంటి? వాటిని హీరో ఎలా పరిష్కరించాడు? అనే నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘నా కోరికే నా అర్హత’. ‘నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం’. ‘ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగున పరిక్ష పెడుతుంది’. ‘ఈ కార్యానికి వైధ్యుడైన శ్రీ కృష్ణుడు ఎంచుకున్న మరో వైధ్యుడు నువ్వే’. అనే డైలాగ్స్ సినిమాపై విపరీతమైన క్యూరియసిటీని పెంచుతున్నాయి. ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సారి మొదటి పార్టును మించి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది. సినిమాను చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించినట్లు విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. కాలభైరవ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. కార్తిక్ ఘట్టమనేని కెమెరా విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.