Ooru Peru Bhairavakona | ప్రతీ ఏడాది కొత్త కొత్త పాటలు మ్యూజిక్ లవర్స్‌ను పలుకరిస్తుంటాయని తెలిసిందే. పాటలెన్నీ లాంఛ్ అయినా.. వాటిలో ఒకటి, రెండు పాటలు మాత్రమే ఆ ఏడాదంతా మార్మోగిపోతుంటాయి. అలాంటి ట్రెండ్ సెట్ చేసిన పాటల్లో టాప్‌లో ఉంటుంది నిజమే నే చెబుతున్నా సాంగ్ (Nijame Ne Chebutunna). టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే.
చాలా రోజుల క్రితమే లాంఛ్ చేసిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. సినిమాకు హైప్ తేవడానికి ఒక్క పాట చాలు. అలా ఈ పాట 50 లక్షలకుపైగా వ్యూస్‌తో టాప్‌లో నిలుస్తోంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు లక్షల్లో రీల్స్, కవర్ వెర్షన్స్ చేశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజమే నే చెబుతున్నా జానే జానా.. నిన్నే నే ప్రేమిస్తున్నా.. అంటూ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్ జాబితాలో చేరిపోయింది.
శ్రీమణి రాసిన ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజ్ చేశాడు. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
నెట్టింట రీల్స్..
From 50 Million+ views on YouTube 💥
To Lakhs of Reels on Instagram and thousands of cover versions 😍#NijameNeChebutunna is a sensation all over❤️
Grateful to all for the immeasurable love 🙏🏻– https://t.co/BkYlMjg6Q2#OoruPeruBhairavakona @sundeepkishan @VarshaBollamma… pic.twitter.com/g1R0Z1SbdX
— BA Raju’s Team (@baraju_SuperHit) September 27, 2023
#NijameNeChebutunna hits @varusarath5‘s heart too❤️
Thank you for all the love 💕
– https://t.co/vPvclisk0D#OoruPeruBhairavakona@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @sidsriram @ShreeLyricist #ShekarChandra @AKentsOfficial @RajeshDanda_ @adityamusic pic.twitter.com/vG9mbsRQka
— Hasya Movies (@HasyaMovies) June 15, 2023
నిజమే నే చెబుతున్నా లిరికల్ సాంగ్..