అందరూ కొత్తవాళ్లతో..
నూతన తారాగణంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిహారిక కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
నూతన తారాగణంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిహారిక కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్‌తేజ్ క్లాప్‌నివ్వగా, నాగబాబు కెమెరా స్విఛాన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్స్ మాత్రమే చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్స్ తీయబోతున్నాం. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చెప్పింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్‌దేవ్, ప్రొడక్షన్ డిజైనర్: ప్రణయ్ నైని, రచన-దర్శకత్వం: యదువంశీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

