Nidhhi Agerwal | ప్రస్తుతం హరిహరవీరమల్లు, రాజా సాబ్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది బెంగళూరు సుందరి నిధి అగర్వాల్. గతకొంతకాలంగా నాయికగా రేసులో వెనకబడ్డానని, ఈ రెండు సినిమాలు తన కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తాయని నమ్మకం వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. ‘రాజాసాబ్’ చిత్రంలో తన పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని పేర్కొంది.
ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేయడంతో..అదే తరహా క్యారెక్టర్స్‌ను ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే ‘రాజాసాబ్’ చిత్రంతో ప్రేక్షకులు ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఈ సినిమాలో నా పాత్ర గ్లామర్ పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నా ఇమేజ్ను మార్చే చిత్రమిది. అయితే పాత్ర గురించి ఎలాంటి వివరాలను ఇప్పుడే వెల్లడించడం ఇష్టం లేదు’ అని చెప్పింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా సాబ్’ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.