Nidhhi agerwal| కెరీర్లో చాలా సినిమాలే చేసిన కూడా మంచి గుర్తింపు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో లైమ్ లైట్లోకి వచ్చిన ఈ భామ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తుంది. ఏఎం రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ముందుగా మార్చిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని పలు కారణాల వలన వాయిదా పడిది. ఇటీవల మే 9న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమా కావడంతో వీరమల్లుకు ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్.
వీరమల్లు నుంచి రెండు పాటలు రిలీజవగా అందులో రీసెంట్ గా నిధి అగర్వాల్ తో ఉన్న కొల్ల గొట్టినాదిరో సాంగ్ ఓ ఊపు ఊపేస్తుంది. అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్‌తో ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు మేకర్స్. కొల్లగొట్టినాదిరో సాంగ్ లోని హుక్ స్టెప్ ను స్పెషల్ గా రిలీజ్ చేసి ఆ సాంగ్ కు రీల్స్ చేయమని ఆడియన్స్ ను కోరారు. రొమాంటిక్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ తమదైన శైలిలో స్టెప్పులు వేసి ఆడియన్స్‌ని అలరించారు. ఇక నిధి అగర్వాల్ కూడా ఈ పాటకి రీల్స్ చేయాలంటూ ఛాలెంజ్ విసిరింది.
మీ డ్యాన్స్ మూమెంట్స్ ను మాకు చూపించండంటూ తను చేసిన రీల్ ను పోస్ట్ చేస్తూ కోరింది నిధి. ఈ అమ్మడు షేర్ చేసిన వీడియోలో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. టీంతో కలిసి నిధి కూడా తన స్టెప్పులతో అదరగొట్టింది. మరి నిధి చేసిన ఈ ఛాలెంజ్ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఎం. ఎం కీరవాణి సంగీతంలో వచ్చిన ఈ పాట ఇప్పటికే ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. ఈ సినిమాకు ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ఊహించని విధంగా ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఫ్రేమ్‌లోకి ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ వచ్చాడు. మరి ఈ మూవీ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో చూడాలి.
Absolutely loved performing the #Kollagottinadhiro hook step in #HariHaraVeeraMallu! 💃✨
Now it’s your turn, take on the reel challenge and show us your dance moves! #HHVM 2nd single – https://t.co/FEz4facjEV#UdaaKeLeGayi – #EmmanasaParichutta – #KaddhukonduHodhalo -… pic.twitter.com/xhiUQhqflE
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) March 17, 2025