పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, ఏ.ఎం.రత్నం కెమెరా స్విఛాన్ చేశారు.
వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే క్యాప్షన్స్ ఆసక్తిని రేకెత్తించాయి. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయనంకా బోస్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచనా సహకారం: సి.చంద్రమోహన్, స్క్రీన్‌ప్లే: కె.దశరథ్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.