Mana Shankara Vara Prasad Garu | సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్రకథానాయకుడు చిరంజీవి హీరోగా రాబోతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana ShankaraVaraPrasadGaru). నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ సంబంధించి కీలక అప్డేట్ను షేర్ చేసింది చిత్రయూనిట్. ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 05 నుంచి సెప్టెంబర్ 19 వరకు శరవేగంగా జరుగబోతున్నట్లు ఇందులో రెండు పాటలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రకరించబోతున్నట్లు చిత్రబృందం చెప్పుకోచ్చింది. అలాగే అక్టోబర్‌లో జరిగే షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్లో వెంకటేశ్ గారు జాయిన్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.