మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం భోళా శంకర్ (Bhola Shankar) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్ నటిస్తోంది. భోళా శంకర్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. భోళా శంకర్ ఏప్రిల్ లేదా మే నెలలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ఇప్పటికే చిరంజీవి హింట్ ఇచ్చేశాడు.
ఈ సినిమా విడుదలకు సంబంధించిన కొత్త అప్డేట్ ఒకటి ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది. ఇప్పుడు భోళా శంకర్ కొత్త రిలీజ్ ప్లాన్ వార్త బయటకు వచ్చింది. ఆగస్టు (2023)లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిరంజీవి టీం ఫిక్సయినట్టు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ టీం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు మరికొంత సమయం తీసుకోనుందని, అందుకే కొత్త విడుదల తేదీపై ఫోకస్ పెట్టిందని ఇన్సైడ్ టాక్.
భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.