ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అంటున్నారు. స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో సాగే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వినిపిస్తున్నది. ఇందులో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తారట. సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైన్యంలో ఓ సైనికుడిగా ఆయన పాత్ర ఉంటుందని టాక్. ఈ నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథను హను రాఘవపూడి రాసుకున్నారట. ఆగస్ట్ 22న ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మ్రైత్రీమూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.