Deepika Padukone | దీపిక పదుకొణే కొన్ని నెలలుగా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. డెలివరీ సమయం దగ్గర పడుతుండటంతో సాధ్యమైనంత వరకూ శరీరంపైనే దృష్టి పెట్టి, సుఖ ప్రసవం కోసం యోగాసనాలతో, మెడిటేషన్‌తో కాలం గడుపుతున్నది దీపిక. బిడ్డ పుట్టాక కూడా.. వచ్చే ఏడాది మార్చి వరకూ షూటింగ్స్‌లో పాల్గొన కూడదని ఆమె నిర్ణయించుకున్నదట.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ‘నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం జరగబోతున్నది. తను నాలోనే ఉన్నా.. తనని చూడాలన్న ఆశ మాత్రం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎదురుచూపుల్లో ఇంత బాధ ఉందా? అనిపిస్తున్నది.
రీసెంట్గా మేం ఓ ఇల్లు కొన్నాం. గృహప్రవేశం అయితే చేయలేదు. తనొచ్చేస్తే.. ముగ్గురం కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెడతాం. నేను అమ్మను అవుతున్నా.. ఇది మాటలకందని అనుభూతి’ అంటూ చెప్పుకొచ్చింది దీపిక.