Network on Aha | తెలుగు ప్రేక్షకులకు క్వాలిటీ కంటెంట్‌ను అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ ‘నెట్వర్క్’ వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. ఈ సిరీస్ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య వై.ఎస్, ఎం.జి. జంగం ఈ సిరీస్‌ను నిర్మించారు. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, అత్యద్భుత విజువల్స్‌తో మొదటి సన్నివేశం నుంచి చివరిదాకా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సిరీస్‌పై భారీ అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ఆన్లైన్ డిపెండెంట్, ఆన్లైన్ గ్యాంబ్లర్, ఆన్లైన్ డేటింగ్, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్… ఇలా నాలుగు పాత్రలు నెట్వర్క్ నేపథ్యంతో ముందుకు సాగడం, ఆ తర్వాత కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులలో చాలా ఉత్సాహాన్ని నింపాయి. “మనం డైరెక్షన్స్ ఇస్తే పని చేయాల్సిన వస్తువు… మన లైఫ్‌ని డైరెక్ట్ చేయకూడదు” అనే డైలాగ్ నెట్వర్క్ కథ యొక్క లోతును తెలియజేస్తోంది.
ఈ సిరీస్‌లో తాగుబోతు రమేష్, సమ్మెట గాంధీ, జోష్ రవి, మీనా కుమారి, ఛత్రపతి శేఖర్, శివ (హిట్ 2), పద్మంజలి, కల్పలత (పుష్ప తల్లి), జెమినీ సురేష్, సిద్ధార్థ మీనన్, మహేష్ విట్టా, శివాని, మహి, మౌనిక రెడ్డి, జబర్దస్త్ ఫణి, చిత్రం శ్రీను, సుమన్ శెట్టి, ఫన్ బకెట్ భార్గవి, ఫన్ బకెట్ ఫణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించడం విశేషం. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ వెబ్ సిరీస్‌కు హైలెట్‌గా నిలవనుంది. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన నటన, సాంకేతిక నైపుణ్యంతో “నెట్వర్క్” వెబ్ సిరీస్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ అనుభూతిని అందించనుంది. ఈ వీకెండ్లో ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌ను తప్పకుండా చూడాలని మేకర్స్ కోరారు.