Bro Teaser | టీజర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ మిస్సింగ్ బ్రో అంటున్న నెటిజన్లు..!
Bro Teaser | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం బ్రో (Bro The Avatar). భీమ్లా నాయక్‌కు సంభాషణలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ చిత్రానికి కూడా డైలాగ్స్ రాశారని తెలిసిందే.
Bro Teaser | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం బ్రో (Bro The Avatar). వినోధయ్ సీతమ్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ విడుదల చేసిన బ్రో టీజర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. అయితే ఓ విషయంలో మాత్రం అభిమానలు నిరాశకు లోనవుతున్నారన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. భీమ్లా నాయక్‌కు సంభాషణలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas). ఈ చిత్రానికి కూడా డైలాగ్స్ రాశారని తెలిసిందే.
ఏ సినిమాలోనైనా తన మార్క్ చూపించే త్రివిక్రమ్ మేనియా బ్రోలో మాత్రం మిస్సయినట్టు టీజర్‌తో అర్థమవుతోంది. ఈ కారణం వల్లే మూవీ లవర్స్ నిరాశలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. టీజర్లో ఒకటి, రెండు డైలాగ్స్ మినహా పెద్దగా చెప్పుకునేంత సంభాషణలు లేకపోవడం త్రివిక్రమ్ ఫ్లేవర్ లేనట్టు స్పష్టమవుతోంది. మరి ట్రైలర్‌లోనైనా అభిమానులను ఇంప్రెస్ చేసే డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇప్పటికే బ్రో మూవీ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. ట్రెండింగ్ అవుతున్నాయి. టైమ్ లైన్ విజువల్స్‌తో బ్రో టీజర్ షురూ అవగా.. ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఏవండి ఎవరూ లేరా అని అడుగుతున్నాడు చీకట్లో ఉన్న సాయిధరమ్ తేజ్. హలో మాస్టారు.. గురువుగారు.. హలో తమ్ముడు.. బ్రో అనే డైలాగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండగా.. పవన్ కల్యాణ్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. చివరలో సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్వు అని సాయిధరమ్ తేజ్‌ను అడుగుతున్నాడు పవన్ కల్యాణ్.
బ్రో టీజర్..
ఈ చిత్రంలో మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న బ్రో చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

