Sakshi Malik | హీరోయిన్ చెంప చెళ్లుమనిపించిన కొరియోగ్రాఫర్.. ఏమైందంటూ నెటిజన్లు ఆరా
Sakshi Malik | మ్యూజిక్ వీడియోలు, మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎంతగానో అలరిస్తుంది.
Sakshi Malik | మ్యూజిక్ వీడియోలు, మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎంతగానో అలరిస్తుంది. స్టైలిష్ ఫొటోషూట్లు, ఫిట్నెస్ కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుదంది. సాక్షికి పెద్ద ఎత్తున పాపులారిటీ తెచ్చిన ప్రాజెక్ట్ సోను కే టిటు కి స్వీటీ సినిమాలోని హిట్ సాంగ్ బోమ్ డిగ్గీ డిగ్గీ . ఈ పాటలో ఆమె స్టన్నింగ్ లుక్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో యువతను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇటీవల సాక్షి రకరకాల భంగిమల్లో ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
టాప్ మోడల్‌గా సాక్షి టీవీ కమర్షియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. 2020లో మారుతి ఆటో ఎక్స్పో వేదికపై బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొని ప్రత్యేకంగా నిలిచింది. ఆ తరువాత సినీ రంగంపై దృష్టి సారించింది. కాలేజీ సమయంలోనే ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. నైకా , పిసి జ్యువెలర్స్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ప్రచారాలు చేసింది.2020లో తెలుగులో విడుదలైన ‘వి’ చిత్రంలో , ఆమె అనుమతి లేకుండా ఆమె ఫోటోను వాడినందుకు సాక్షి బాంబే హైకోర్టును ఆశ్రయించింది . కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఆ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ నుంచి తొలగించాలంటూ ఆదేశించింది .
తర్వాత మేకర్స్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించారు.
‘వేహం’ (2020) ‘ములాఖత్’ (2023)** వంటి మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా నటించింది. గ్లామర్, టాలెంట్, లీగల్ అవేర్నెస్ మేళవింపుతో ముందుకు సాగుతూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పెంచుకుంటోంది.తాజాగా ఆమెకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా, ఇందులో సాక్షిని కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్ చెంపదెబ్బ కొట్టినట్టు కనిపించింది. దీంతో కారణం లేకుండా ఆమెని ఎందుకు కొట్టావంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో సాక్షి మాలిక్ స్పందిస్తూ.. ఇది మా యాక్టింగ్ వచ్చిన వీడియో తప్ప, ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే దీనిపై కొందరు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ మానండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

