గూగుల్ తప్పిదం.. మండిపడుతున్న శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్

గూగుల్ ఇటీవల పలు విమర్శలు ఎదుర్కొంటుంది.ఆ మధ్య గూగుల్‌లో మన దేశంలో చెత్త భాష ఏంటని సెర్చ్ చేయగా, కన్నడ అని ప్రత్యక్షం అయింది. దీనిపై నటి ప్రణీతతో పాటు కన్నడీగులు మండిపడ్డారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విషయంలోను గూగుల్ చాలా పెద్ద తప్పు చేసింది. అందులోని సమాచారం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.
గూగుల్‌లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేయగా, ఆయన పుట్టిన సంవత్సరం 1963 అని, చనిపోయిన రోజు జూలై 8,2003 అని వస్తోంది. ఇది చూసి ఆయన అభిమానులు అవాక్కయ్యారు. మంచిగా ఉన్న వ్యక్తిని గూగుల్ ఇలా చంపేసిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళనాడుకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ జేవీ శేఖర్ని అందరూ మాస్టర్ శేఖర్ అనేవారు. దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆయన జూలై 8వ తేదీ 2003లో మరణించారు. ఆయన సమాచారాన్నిపొరపాటున కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటోతో అప్లోడ్ చేసింది గూగుల్. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

