యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
యాసంగిలో వరి సాగుకు బదులుగా రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏడీఏ సరిత అన్నారు. శుక్రవారం గుర్రంపోడ్ మండలంలోని పాల్వాయి గ్రామంలో ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా పంచాయతీ కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు..
గుర్రంపోడ్, ఆక్టోబర్ 23 : యాసంగిలో వరి సాగుకు బదులుగా రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏడీఏ సరిత అన్నారు. శుక్రవారం గుర్రంపోడ్ మండలంలోని పాల్వాయి గ్రామంలో ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా పంచాయతీ కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలు సాగు చేయాలని, నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఏవో మాధవరెడ్డి మాట్లాడుతూ.. నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులను వినియోగించి భూసారాన్ని పరిరక్షించాలని, సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఏఈఓ భగీరథ మాట్లాడుతూ.. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపాలని, వర్షపు నీటిని సంరక్షిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ ప్రసాద్, గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

