Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
Abhijeet Dipke : బీజేపీ ప్రభుత్వం కాపాడాల్సింది ఢిల్లీని కాదని.. చైనాతో ఇండియా పంచుకుంటున్న సరిహద్దును అని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. చైనా సరిహద్దులో భారత జవాన్లతో చైనా సైన్యం ఘర్షణకు దిగుతుండటాన్ని దీప్కే తప్పుబట్టారు.
Abhijeet Dipke : బీజేపీ ప్రభుత్వం కాపాడాల్సింది ఢిల్లీని కాదని.. చైనాతో ఇండియా పంచుకుంటున్న సరిహద్దును అని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. తాజాగా చైనా సరిహద్దులో భారత జవాన్లతో చైనా సైన్యం ఘర్షణకు దిగుతుండటాన్ని దీప్కే తప్పుబట్టారు. సరిహద్దుల్ని కాపాడటానికి వినియోగించాల్సిన సైన్యాన్ని దేశంలో నిరసనల్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం వాడుతోందని దీప్కే విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో, ఇండియా-చైనా సరిహద్దులో నిత్యం ఏదో ఒక చోట ఘర్షణ జరుగుతూనే ఉందని తాజాగా ఐటీబీబీపీ చీఫ్ శతృజీత్ కపూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మన సైన్యానికి, అక్కడ పని చేస్తున్న భారత సైన్యమైన ఐటీబీపీకి మధ్య కొద్ది రోజులుగా నిత్యం ఘర్షణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇక్కడ సరిహద్దు కోసం కేంద్రం కొత్తగా తయారు చేసిన శౌర్య కమాండోలు ధైర్యంగా పని చేస్తున్నట్లు కపూర్ తెలిపారు. ఇప్పుడు ఇదే అంశంపై దీప్కే కేంద్రాన్ని, ప్రధాని మోదీని ప్రశ్నించారు. సైన్యాన్ని వాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటని దీప్కే నిలదీశారు.
Yeah, because forces that should be protecting our borders are being deployed to stop citizens from protesting.
Modi is putting national security at risk by using security forces against his own countrymen.
The priority should be securing our borders, not turning Delhi into a fortress to suppress peaceful protests.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 23, 2026
దేశ సరిహద్దుల్ని రక్షించాల్సిన సైన్యాన్ని సొంత ప్రజలు నిరసన చేయకుండా వాడటం వల్లే చైనా సరిహద్దులో ఘర్షణ జరుగుతోందన్నారు. సొంత ప్రజల్ని అణచివేసేందుకు మోదీ దేశ భద్రతను పణంగా పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం రక్షించాల్సింది ఢిల్లీని కాదని.. సరిహద్దుల్ని అని దీప్కే సూచించారు. శాంతియుత నిరసనల్ని అడ్డుకోవడం సరికాదన్నారు. మరోవైపు సరిహద్దులో చైనాతో చెలరేగుతున్న ఘర్షణపై కాంగ్రెస్ పార్టీ, శివసేన యూబీటీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

