జానే జాన్ నెట్‌ఫ్లిక్స్: సెప్టెంబర్ 21 తారాగణం: కరీనా కపూర్, జైదీప్ అహల్వత్, విజయ వర్మ, సౌరభ్ తదితరులు.దర్శకత్వం: సుజయ్ ఘోష్బాక్సాఫీస్ను పలకరించకుండానే కొన్ని సినిమాలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్నాయి. నేరుగా ఓటీటీ కోసం సిద్ధమవుతున్న చిత్రాల్లో అగ్రనటులూ నటిస్తున్నారు. బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్ మొదటిసారి ఓటీటీ తలుపుతట్టింది. పక్కా క్రైమ్ ఎలిమెంట్ సబ్జెక్ట్ ఎంచుకొని సత్తా చాటింది.
సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘జానే జాన్’ మిస్టరీ థ్రిల్లర్‌గా నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను అలరిస్తూ టాప్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఇక కథలోకి వెళ్తే… మాయా డిసౌజా (కరీనా కపూర్) భర్త అజిత్ మాత్రే (సౌరభ్) పోలీస్ అధికారి. మాయ అతని నుంచి విడిపోతుంది. నేపాల్‌లో ఓ చిన్న రెస్టారెంట్ నడుపుకొంటూ కూతురు తారను కనిపెట్టుకొని ఉంటుంది. నేపాల్‌లో మాయ పక్క ఫ్లాట్‌లో ఉండే నరేన్ వ్యాస్ (జైదీప్) ఓ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు.
ఒకరోజు మాయ భర్త అజిత్ మాత్రే తన కూతురును చూడాలని నేపాల్‌కు వస్తాడు. బిడ్డను తనతో పంపాల్సిందిగా భార్యను అడుగుతాడు. కూతురును పోర్న్‌స్టార్‌ను చేస్తానని చెబుతాడు. భర్త వికృత వైఖరిపై మండిపడి అతనితో గొడవకు దిగుతుంది మాయ. ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది. ఈ క్రమంలో మాయ అతణ్ని చంపేస్తుంది. ఈ విషయం పక్క ఇంట్లో ఉన్న నరేన్‌కు తెలుస్తుంది. పరిస్థితి అర్థం చేసుకున్న నరేన్ ఆమెకు అండగా నిలవాలని భావిస్తాడు. ఇంతకీ ఈ హత్య విషయాన్ని వాళ్లు దాచగలిగారా? అజిత్‌ను వెతుక్కుంటూ నేపాల్‌కు వచ్చిన పోలీస్ కరణ్ ఆనంద్ (విజయ వర్మ) ఈ కేసును ఎలా ఛేదించాడు అన్నదే మిగిలిన కథ!