న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రముఖ కంటెంట్ స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్.. మంగళవారం వివిధ నెలసరి సబ్స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించింది. గరిష్ఠంగా 60 శాతం వరకు కోత పెట్టడం గమనార్హం. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. దేశీయ ఓటీటీ మార్కెట్లో పెరిగిన పోటీ దృష్ట్యా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే ప్లాన్ల ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తున్నది.
కాగా, అమెజాన్ ఇటీవలే తమ ప్రైమ్ ప్రోగ్రామ్ వార్షిక సభ్యత్వం ధరను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ మార్కెట్లో ఏకంగా 50 శాతం పెంచుతూ రూ.1,499కి చేర్చింది. నెలసరి, త్రైమాసిక ధరలనూ పెంచింది. అయితే డిస్నీప్లస్హాట్స్టార్ వార్షిక ప్లాన్ రూ.899కే లభిస్తున్నది.