కౌశిక్‌బాబు, శాన్వీ మేఘన జంటగా నటించిన చిత్రం ‘నేనే సరోజ’. శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను శాసన సభ్యులు ముఠా గోపాల్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆడ వాళ్లపై దాడి చేసే ఉన్మాదులకు తగిన గుణపాఠం చెప్పాలనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం.
కాలేజీ విద్యార్థినిగా శాన్వీ మేఘన పాత్ర ధైర్యసాహసాలతో సాగుతుంది’ అన్నారు. సెన్సార్ పూర్తయి ‘యు’ సర్టిఫికెట్ లభించిందని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత, రచయిత డా॥ సదానంద్ తెలిపారు.