Neha Sharma | మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కథానాయికగా నేహా శర్మ నటించింది. ఇందులో రామ్ చరణ్ ,నేహా శర్మల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సినిమా తర్వాత నేహా శర్మ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరు అనుకున్నారు. కాని అదృష్టం కలిసి రాలేదు. రాజకీయ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకుంది.
అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టిన నటిగా అవకాశాలకు మాత్రం ఆమడ దూరంలోనే ఉంటుంది. చిరుత వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నేహా శర్మ 2009లో కుర్రాడు అనే సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ అంతగా అలరించలేకపోయింది. 2010లో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ ఏడాది వచ్చిన ‘క్రూక్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నేహా శర్మకు చాలా సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించాయి.కాని ఏ చిత్రం కూడా అమ్మడికి మంచి విజయం అందించలేకపోయింది. దాంతో నటి నేహా శర్మ 2020 నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అయితే ఈ అమ్మడి డేటింగ్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగున్న అడుగులు ఉండే నేహా ఏడడుగుల వ్యక్తితో డేటింగ్ చేస్తుందనే ప్రచారం జోరుగా నడుస్తుంది. పీటర్ స్లిస్కోవిచ్ అనే ఏడడగుల అందగాడితో బాంద్రాలోని ఒక రెస్టారెంట్ నుండి బయటకు వెళుతూ కెమెరా కంటికి చిక్కింది నేహ శర్మ చిక్కింది. ఇటీవల వీరిద్దరు సరదాగా విహరిస్తున్నారు. దాంతో ఇద్దరి మధ్య డేటింగ్ వ్యవహారం నడుస్తుందని ,త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని బాలీవుడ్ మీడియా చెబుతుంది. మరి దానికి నేహా శర్మ సమాధానం ఏమిటో చూడాలి.