సీనియర్ దర్శకుడు నీలకంఠ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘సర్కిల్’. ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శతృవులవుతారో’ ఉపశీర్షిక. సాయిరోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మోహతా, రిచా పనై ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
సోమవారం ఈ చిత్ర టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నీలకంఠ గత చిత్రాల తరహాలోనే వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని, సంగీతం: ఎన్.ఎస్.ప్రశు, నిర్మాతలు: ఎమ్.వి.శరత్చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ.