‘తండేల్’ చిత్రంతో వందకోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరారు హీరో నాగచైతన్య. తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించనున్నారు. శనివారం ఈ సినిమాకు సంబందించి ‘ఎన్సీ 24-ది ఎక్స్కవేషన్ బిగిన్స్’ అంటూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
ఈ సినిమా కోసం నాగచైతన్య సరికొత్తగా మేకోవర్ అయిన వైనాన్ని వీడియోలో చూపించారు. మిథికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీల్ డి కున్హా, సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: కార్తీక్ దండు.