NBK 111 |బాలయ్య–గోపీచంద్ మలినేని సినిమా సందడి.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షూట్ ప్లాన్
NBK 111 | నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అనౌన్స్మెంట్తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మ్యూజిక్ పనులతో మరో అడుగు వేసింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు.
NBK 111 | నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అనౌన్స్మెంట్తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మ్యూజిక్ పనులతో మరో అడుగు వేసింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం, రెండు ట్యూన్స్‌ను పూర్తిచేసిన థమన్, వాటిలో ఒక సాంగ్‌కి ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ తో పాట రాయించినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సాంగ్ షూట్ పూర్తయ్యిన వెంటనే అక్కడే ఒక కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించనున్నట్లు సమాచారం. భారీ సెట్స్, విజువల్ గ్రాండియర్‌తో ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్లో బాలకృష్ణను ఒక రాజుగా చూపించగా, హీరోయిన్గా నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇది ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇప్పటికే బాలయ్య–నయనతార కాంబినేషన్ ప్రేక్షకులను పలుమార్లు మెప్పించింది. వీరిద్దరూ కలిసి నటించిన సింహా, శ్రీరామ రాజ్యం, జై సింహా చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ జోడీ తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాత సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కథ, సెట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, బాలయ్య–గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ పీరియాడిక్ మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతుండగా, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

