Nayanthara | సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారూఖ్ ఖాన్ ‘జవాన్’ తో బాలీవుడ్ ప్రేక్షకులని సైతం అలరించింది. జవాన్ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే హయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ బిగ్ ఫిల్మ్ మేకర్స్ నయనతారతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
తాజాగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తను చేయబోయే’ బైజు బావ్రా’ లో ఒక కీలక పాత్రను పోషించడానికి నయనతారను సంప్రదించారు. ‘బైజు బావ్రా’లో రణ్వీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన సెకండ్ లీడ్ కూడా వుంది. ఆ పాత్ర కోసం నయనతారతో చర్చలు జరుపుతున్నారు. సంజయ్ లీలా బన్సాలీ సినిమాకి ఒక ప్రత్యేక ముద్ర వుంటుంది. నయన కూడా ఈ సినిమాలో భాగం కావడానికి ఆసక్తిని కనబరిచారని తెలుస్తోంది. 1950 నాటి మ్యూజికల్ పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా ఉండబోతుంది.