Nayanthara-Vignesh Shivan Marriage Video | కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేష్ శివన్‌లు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఏడేళ్ళ పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్ 9న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు పలువురు సినీప్రముఖులు హాజయ్యారు. రజినికాంత్, షారుఖ్ ఖాన్, దర్శకుడు అట్లీ, ఏ.ఆర్ రెహమాన్‌తో పాటు దక్షిణాది, ఉత్తరాది స్టార్ సెలబ్రెటీలు పెళ్లిలో సందడి చేశారు. కాగా వీరి పెళ్లి వీడియో ప్రసార హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
అయితే తాజాగా ఈ సంస్థ త్వరలో నయన్, విఘ్నేష్‌ల పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. కాగా వీరి పెళ్లి వీడియో కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు 25కోట్లు చెల్లించిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ జంటతో పెళ్లి తర్వాత ఫోటోలు గాని, వీడియోలు గాని బయటకు రాకూడదు అని ఒప్పందం కుదుర్చుకుందట. కానీ విఘ్నేష్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రముఖులతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. దాంతో నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందం రద్దు అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్గా ఈ వార్తలపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్పందించి అవన్ని రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నయన్- విఘ్నేష్‌లు బీచ్‌లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వీరి పెళ్లి వీడియోను త్వరలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
These images of Nayanthara and Vignesh have us seeing stars 🤩✨
BRB, we're doing a little happy dance ourselves because THEY’RE coming to Netflix🕺💃it’s beyond a fairy tale!! pic.twitter.com/14poQwNAZv
— Netflix India (@NetflixIndia) July 21, 2022