సినీ ఇండస్ట్రీలో రూమర్లు సర్వసాధారణం. మరీ ముఖ్యంగా సోషల్‌మీడియా వచ్చాక.. రైటర్లు ఎక్కువై పోయారు. చిన్న లూప్ దొరికితే చాలు.. దానిపై ఇష్టానుసారం అల్లేయడం ప్రస్తుతం పరిపాటైపోయింది. ఇందులో భాగంగానే రీసెంట్గా నయనతార దంపతులు విడిపోనున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారన్న కోణంలో పలు వెబ్సైట్లలో కథనాలు కూడా వచ్చాయి. వీటిపై తాజాగా నయనతార స్పందించారు. తన భర్త విఘ్నేష్‌శివన్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మాపై వచ్చే సిల్లీ న్యూస్‌కి మా రియాక్షన్ ఇదే..’ అంటూ అసత్య ప్రచారాలకు చెక్ పెట్టేశారు నయన్.
నిజానికి ఈ వదంతులకు కారణం లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం స్వయంగా నయనతార ఓ పోస్ట్ పెట్టారు. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు..’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు నయన్. అయితే.. ఏమైందో ఏమో.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేసేశారామె. అయితే.. అప్పటికే ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ విపరీతంగా వైరల్ అయిపోయాయి. దాంతో విడాకులు అంటూ ప్రచారం మొదలైంది. అదన్నమాట అసలు విషయం.