Nayanthara-prithviraj Sukumaran Gold Movie | మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో పలు విభాగాల్లో పనిచేస్తూ మాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఈయన నటించిన సినిమాలు విడుదల కాకపోయినా ఓటీటీలలో ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టు అని మలయాళంలో ఒక ఫార్ములా ఉంది. ఇటీవలే ఈయన నటించిన ‘జన గణ మన’ మలయాళంలో సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఒక్క మలయాళ భాషలోనే కాకుండా ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈయన నయనతారతో కలిసి ‘గోల్డ్’ చిత్రంలో నటించాడు.
‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆల్ఫోన్స్ పుత్రెన్ ‘గోల్డ్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే మేకర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
#GOLD An #AlphonsPuthran Film! 😊❤️ @puthrenalphonse @PrithvirajProd @magicframes2011 pic.twitter.com/6fROJlPkQD
— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 6, 2022