సినిమా ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొనదు. ఈ విషయంపై ఆమె పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.. ఎదుర్కొంటున్నారు కూడా. అయితే.. రీసెంట్గా చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెగా 157’(వర్కింగ్ టైటిల్) మూవీకి మాత్రం తాను నటిస్తున్నట్టు చెప్పే క్రమంలో.. తెగ ప్రమోట్ చేశారు నయన్. అనిల్ రావిపూడి మార్క్ జోష్‌తో వీడియోల్లో చెలరేగిపోయారు. వీటిపై కోలీవుడ్‌లో విమర్శలు వచ్చాయట.
టాలీవుడ్ సినిమాపై అంత మమకారం ఉంటే అక్కడే సినిమాలు చేయొచ్చుగా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. దీనిపై నయన్ ఇటీవలే స్పందించారు. ‘సమయాన్ని వృథా చేసుకోవడం నాకిష్టం ఉండదు. వీలును బట్టి నా నిర్మాతలకు సహకరిస్తూనే ఉన్నా. ఈ విషయంపై ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది నా వ్యక్తిగతమైన ఛాయిస్’ అంటూ నిర్మొహమాటంగా సమాధానమిచ్చింది. ప్రస్తుతం నయనతార చేతిలో తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ భాషల్లో కలిపి ఓ అరడజనుకు పైగా
సినిమాలున్నాయి.