Nayanathara New Movie O2 Teaser | హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ నయనతార. ఇప్పుడున్న హీరోయిన్లలో నయనతార చేసినన్ని ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను మరెవరు చేయలేరు. ‘కర్తవ్యం’, ‘మయూరి’, ‘కోకోకోకిల’ వంటి సినిమాలతో హీరో సెంట్రిక్ సినిమలకు ధీటుగా కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న మరో మహిళా ప్రధాన చిత్రం ‘O2’. గత కొంత కాలంగా ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అసలు ఈ చిత్రం విడుదలవుతుందా అనే సందేహం ప్రేక్షకులలో కలిగింది. అయితే లేటెస్ట్గా చిత్రబృందం ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే నయనతార, ఇతర ప్రయాణికులు కలిసి కొచ్చిన్‌కు వెళ్తున్న బస్సు లోయలో పడిపోతుంది. అందులో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీ బాట పట్టనుంది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవలే నయనతార నటించి నిర్మించిన కతువాకుల రెండు కాదల్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తుంది.