కిరణ్ అబ్బవరం నటిస్తున్న పిరియాడిక్ థ్రిల్లర్ ‘క’. ఇందులో నయన్ సారిక కథానాయిక. ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. లంగావోణీలో సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా ఈ లుక్‌లో నయన్సారిక కనిపిస్తున్నది. ఇందులో ఆమె పాత్ర పేరు సత్యభామ. కథలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, సోమవారం సాయంత్రం ఈ సినిమాకు చెందిన ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్’ను కూడా విడుదల చేయనున్నామని దర్శక ధ్వయం సుజీత్, సందీప్ తెలిపారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డానియేల్, సతీశ్‌రెడ్డి మాసం, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.